‘ఎంత పెద్ద స్టార్స్‌ని అయినా క్యారెక్టర్ల పరంగానే చూస్తూ సినిమా తీసే ఫిల్మ్‌మేకర్ శేఖర్ కమ్ముల. ‘కుబేర’ సినిమాలో కూడా స్టార్స్ కనిపించరు. క్యారెక్టర్లే కనిపిస్తాయి. కచ్చితంగా ఆడియన్స్‌కి ఈ సినిమా న్యూ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతోంది’ అని నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్ రావు అన్నారు. ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో వారు నిర్మించిన సినిమా ‘కుబేర’. రష్మిక మందన్నా హీరోయిన్. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో చిత్ర నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్ రావు విలేకరులతో ముచ్చటించారు. లవ్‌స్టోరీ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల మాకు ఈ ఐడియా ఇచ్చారు. వినగానే ఈ కథకు ధనుష్ అయితే కరెక్ట్ అనిపించింది. ఆయనకు కథ వినిపిస్తే 20 నిమిషాల్లో ఓకే చేశారు. ఇక ఇందులోని మిలియనీర్ పాత్రకు నాగార్జునను తప్ప మరొకర్ని శేఖర్ ఊహించలేకపోయారు. మోస్ట్ రిచ్చెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్.. ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్స్.. సింగిల్ లైన్‌లో ఇదే ‘కుబేర’ సినిమా కథ.

- June 13, 2025
0
41
Less than a minute
Tags:
You can share this post!
editor