అజిత్ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఏప్రిల్‌ 10న రిలీజ్..

అజిత్ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఏప్రిల్‌ 10న రిలీజ్..

తమిళ హీరో అజిత్‌కుమార్‌ నటిస్తున్న తాజా సినిమా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. ఈ సినిమాకు అధిక్‌ రవిచంద్రన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 10న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో విడుదల కానుంది. ఇప్ప‌టికే సినిమా నుండి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికెట్‌ను అందించిన‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. ఈ సినిమాలో అజిత్ ఏకే అనే గ్యాంగ్‌స్ట‌ర్‌గా కనిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి జీవి ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సిమ్రాన్, ప్ర‌భు, అర్జున్ దాస్, సునీల్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

editor

Related Articles