ఎఆర్ రెహమాన్ ఇటీవల ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. విడాకులు, ఆ తర్వాత ఛావా సినిమాకి అందించిన సంగీతం, అనంతరం అనారోగ్యం విషయాలతో హాట్ టాపిక్ అయ్యారు. అయితే తన భార్య నుండి రెహమాన్ విడిపోవడానికి కారణం ఆయన సంగీత బృందంలో బాసిస్ట్‌గా ఉన్న మోహిని డే అనే అమ్మాయి అంటూ జోరుగా ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో, రెహమాన్ భార్య సైరా భాను స్పందించి… రెహమాన్ బంగారం లాంటి వ్యక్తి అని, ఆయననేమీ అనొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక తాజాగా సంగీత దిగ్గజం ఎఆర్ రెహమాన్ అస్వస్థతకు గురి కావడంతో, ఆయనని చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి, చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. అయితే రెహమాన్ ఆసుపత్రికి వెళ్లాడని తెలుసుకున్న ఆయన భార్య సైరా భాను స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, ఛాతి నొప్పి కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారని తెలిసింది. అల్లా దయతో ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి సంతోషిస్తున్నాను అని పేర్కొంది. అయితే కొందరు నన్ను రెహమాన్ మాజీ భార్య అంటున్నారు. అలా పిలవొద్దని సైరా భాను కోరారు. రెహమాన్, తాను ఇంకా విడిపోలేదని, భార్యాభర్తలుగానే ఉన్నామని వెల్లడించారు.
- March 17, 2025
0
115
Less than a minute
You can share this post!
editor

