ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో నిరాశ పర్చిన ప్రభాస్, సలార్, కల్కి వంటి వరుస హిట్లతో తన స్టామినాని చూపించాడు. ఇక ఇప్పుడు సలార్-2, ఫౌజీ, కల్కి-2 సినిమాల్లో నటిస్తున్నాడు. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా కూడా త్వరలో మొదలు పెట్టనున్నాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుండగా, ఈ ఏడాదిలో సినిమా రిలీజ్ కానున్నట్టు సమాచారం. ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో గుదిబండలాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రభాస్‌కు తీవ్ర గాయం అయిందని, ఆయన ఇటలీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు టాక్. మొదటి అంతస్తు నుండి ప్రభాస్ కిందకు జారి పడిపోవడంతో, కాలుకు తీవ్ర గాయం అయిందని, అందుకే అతణ్ణి ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్టు ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు ప్రభాస్ కదల్లేని పరిస్థితిలో ఉన్నారని సమాచారం. అయితే ఈసారి మాత్రం ప్రభాస్ కాలుకి ఐరన్ రాడ్ వేశారని ఆరు నెలల పాటు అతనికి విశ్రాంతి అవసరమని డాక్టర్స్ చెప్పినట్టు తెలుస్తోంది.
- March 6, 2025
0
144
Less than a minute
Tags:
You can share this post!
editor

