‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కేసు’లో RGVకి భారీ ఊర‌ట‌..

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కేసు’లో RGVకి భారీ ఊర‌ట‌..

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊర‌ట లభించింది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకు సంబంధించి న‌మోదైన కేసులో విచార‌ణ‌పై హైకోర్ట్ స్టే విధించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి తీయ‌డంతో పాటు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయ‌ని ఆర్జీవీపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీక‌రించిన సీఐడీ పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇవ్వ‌డంతో పాటు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని కోరారు. అయితే సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశాడు. అయితే ఈ పిటిష‌న్‌కి సంబంధించి ఆర్జీవీ తరపు న్యాయవాదులు నేడు త‌మ వాదన వినిపిస్తూ.. 2019లో విడుదలైన సినిమాపై ఇన్నాళ్లకు ఫిర్యాదు చేయడం సమంజసం కాదని వాదించారు. ఈ వాద‌న‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటి? అని ప్ర‌శ్నించింది. అలాగే ఈ కేసుపై విచారణకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్జీవీపై సీఐడీ తదుపరి చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

editor

Related Articles