కళ్యాణ్‌రామ్‌ సినిమా ఏప్రిల్‌ 21న రిలీజ్…

కళ్యాణ్‌రామ్‌ సినిమా ఏప్రిల్‌ 21న రిలీజ్…

కళ్యాణ్‌రామ్‌ మంచి అభిరుచి గల నిర్మాత. ప్రస్తుతం ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో.. అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసులతో కలిసి కళ్యాణ్‌రామ్‌ ఓ సినిమాని నిర్మిస్తున్నారు. సాయి మంజ్రేకర్‌ కథానాయిక. నాటి లేడీ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. ఏప్రిల్‌లో రిలీజ్‌ చేసే అవకాశం ఉందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ సినిమాకు టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. గతంలో ‘మెరుపు’ అనే టైటిల్‌ అనుకున్నారు. తర్వాత ‘రుద్ర’ అనే టైటిల్‌ బయటకు వచ్చింది. అయితే.. ఈ రెండూ కాకుండా ఏదైనా శక్తివంతమైన పేరును పెట్టాలని చిత్రబృందం యోచిస్తోందట. ప్రస్తుతం టైటిల్‌ అన్వేషణ జరుగుతోంది. ఇటీవలే రషెస్‌ చూసిన కళ్యాణ్‌రామ్‌ చిత్ర విజయంపై నమ్మకంతో ఉన్నారని, ఆయన కెరీర్‌లో అతనొక్కడే, పటాస్‌, బింబిసార తరహాలోనే ఇది కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. శ్రీకాంత్‌, అర్జున్‌ రాంపాల్‌, సౌహైల్‌ఖాన్‌ ఇందులో కీలక పాత్రధారులు.

editor

Related Articles