రష్మిక నటించనున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా?

రష్మిక నటించనున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా?

ప్రస్తుతం ఇండియాలోనే రష్మిక టాప్‌ హీరోయిన్‌. ఆమె నటించిన ‘యానిమల్‌’ వెయ్యి కోట్లను రాబడితే.. ‘పుష్ప2’ ఏకంగా 18 వందల కోట్ల మార్క్‌ని దాటేసింది. ఇక ‘చావా’ సినిమా అయితే.. ఇప్పటికే 500 కోట్ల మార్క్‌ని టచ్‌ చేసింది. మొత్తంగా ఆమె నటించిన మూడు సినిమాల కలెక్షన్లు కలిపితే 3 వేల కోట్ల పైమాటే. ఇప్పుడున్న ఏ హీరోయిన్‌కీ లేని రికార్డ్‌ ఇది. స్టార్‌ హీరోల సినిమాలక్కూడా ఇప్పుడామె అదనపు ఆకర్షణ. అభినయ పరంగా అయితే చెప్పాల్సిన పనేలేదు. అందుకే.. ఈ హీరోయిన్ డేట్లు కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇదిలావుంటే.. రష్మికతో ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమా నిర్మించేందుకు టాలీవుడ్‌కి చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోందని టాక్‌. పాన్‌ ఇండియా స్థాయిలో ఆమెకున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని 70 నుండి 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించనున్నారట.

editor

Related Articles