హీరో ప్రభాస్ స్టార్ లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ఫుల్ కాప్ స్టోరీగా రాబోతోంది. ఐతే, ‘స్పిరిట్’ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ క్రేజీ కామెంట్స్ చేశారు. అద్భుతమైన సంగీతం అందిస్తానని హర్షవర్ధన్ చెప్పారు. ప్రస్తుతం సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని హర్షవర్ధన్ రామేశ్వర్ తెలిపారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, దాన్ని కొనసాగిస్తానని హర్షవర్ధన్ రామేశ్వర్ పేర్కొన్నారు. ఇక స్పిరిట్ సినిమా విషయానికి వస్తే..ఈ సినిమాని టి-సిరీస్ భారీ స్థాయిలో నిర్మించనున్నది. అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలాకొత్తగా ఉంటుందని.. సందీప్‌రెడ్డి వంగా నుండి మరో వినూత్న సినిమా రాబోతోందని తెలుస్తోంది. అన్నట్టు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమా కోసం ఇప్పటికే సాంగ్స్‌ను కంపోజ్ చేయడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

- March 3, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor