9 నెలల పాప సార్‌.. మిస్టరీ నేపథ్యంలో నాని హిట్ 3 ట్రైలర్‌

9 నెలల పాప సార్‌.. మిస్టరీ నేపథ్యంలో నాని హిట్ 3 ట్రైలర్‌

టాలీవుడ్ యాక్టర్ నాని నటిస్తోన్న సినిమా హిట్ 3. శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. టాలీవుడ్ యాక్టర్ నాని  నటిస్తోన్న సినిమాల్లో హిట్ ప్రాంఛైజీ హిట్ 3. శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఉంటే భూమి మీద 10 అడుగుల సెల్‌లో ఉండాలి.. లేదంటే భూమిలో ఆరడుగుల లోతులో ఉండాలి.. ఏ క్రిమినల్‌ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. అలా ఫీలవ్వడానికి పర్సనల్‌గా ఎఫెక్ట్‌ అవ్వాల్సిన అవసరం లేదు సార్.. పోలీసోడైతే చాలు అంటూ అర్జున్‌ సర్కార్‌ చెబుతున్న సంభాషణలతో షురూ అయింది ట్రైలర్‌. 9 నెలల పాప సార్‌.. ఏం చేశారు సార్ ఆ రాస్కెల్స్‌ అంటూ బాధిత చిన్నారి తల్లి విచారణలో చెబుతూ.. నా పాప నాకు కావాలి సార్ అంటోంది. మిస్సింగ్ అయిన బేబీ మిస్టరీని పోలీసాఫీసర్‌ అర్జున్‌ సర్కార్‌ ఎలా ఛేదించాడనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్‌. గ్రిప్పింగ్‌, సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌తో ట్రైలర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. HIT 3 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాని నాని హోం బ్యానర్‌ వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హిట్‌ ఆఫీసర్‌ అర్జున్‌ సర్కార్‌గా నాని సిగార్‌ తాగుతూ, రక్తపు చేతులతో కారు నడుపుతూ, మరోవైపు గొడ్డలితో స్టైలిష్‌గా కనిపిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.

editor

Related Articles