‘ఏమాయ చేశావే’ చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టి, తమిళ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. అయితే, నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ కారణంగా కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్.. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే మూవీ చేస్తోంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే ప్రాజెక్ట్‌లోనూ భాగమైంది. ఇవి కాకుండా ‘శుభం’ అనే సినిమా నిర్మిస్తోంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన సామ్.. హీరో హీరోయిన్ల మధ్య పారితోషికం వ్యత్యాసంపై పెదవి విప్పింది. ఈ విషయంలో హీరోయిన్స్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. హీరోలు, హీరోయిన్లు ఒకేలా కష్టపడుతున్నప్పటికీ పారితోషికాల్లో మాత్రం ఎందుకు ఇంత వ్యత్యాసం..? అని ప్రశ్నించింది. కొన్ని పెద్ద సినిమాల్లో హీరో పాత్ర కీలకంగా ఉంటుంది. పైగా తనే జనాల్ని థియేటర్‌కు రప్పించగలడు. అలాంటి వాటిని నేను అర్థం చేసుకోగలను. అలాంటి సినిమాల్లో ఇద్దరి మధ్య బేధం చూపించినా నేను తప్పుపట్టను. కానీ, కొన్ని చిత్రాల్లో హీరో హీరోయిన్‌లకు ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. పారితోషికం దగ్గర మాత్రం భారీ వ్యత్యాసం చూపిస్తారు. అలా ఎందుకు చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు ఐంది. పరిశ్రమలో నన్ను ఇబ్బందిపెట్టే విషయాల్లో రెమ్యూనరేషన్ ఒకటి. ఈ విషయంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. సడన్‌గా అన్నీ మార్చలేనేమో కానీ భవిష్యత్తు గురించి మాత్రం ఏదో ఒకటి చేయగలను. మార్పు నాతోనే మొదలవ్వాలని అనుకుంటున్నా. అందుకే నా సంస్థలో ఇలాంటి వ్యత్యాసం రాకుండా చూసుకుంటున్నాను’ అని సమంత చెప్పుకొచ్చింది.

- April 14, 2025
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor