చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌ అవార్డుల విజేతలు వీళ్లే..

చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌ అవార్డుల విజేతలు వీళ్లే..

22వ చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఇటీవలె ఘనంగా జరిగింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ఇందులో భాగంగా అమరన్‌ చిత్రానికి ఉత్తమ నటిగా సాయిపల్లవి, మహారాజ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా విజయ్‌ సేతుపతి పురస్కారాలను అందుకున్నారు.

ఈ పురస్కారం అందుకోవడంపై హీరోయిన్ సాయి పల్లవి ఆనందం వ్యక్తం చేస్తూ, ఫ్యాన్స్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశం కోసం నిరంతరం శ్రమించిన ఒక జవాను కథ ఇది. రాజ్‌కుమార్‌ పెరియాసామి లాంటి డైరెక్టర్సే ఇలాంటి మరెన్నో కథలను మనకు అందించగలరు అని సాయి పల్లవి పేర్కొన్నారు.

ఇక ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి కూడా ఆనందం వ్యక్తం చేశారు. మహారాజను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు

ఈ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాలలో అవార్డులు గెలుచుకున్నవారి లిస్ట్ ఇదే..

ఉత్తమ చిత్రం : అమరన్‌

రెండో ఉత్తమ చిత్రం : లబ్బర్‌ పందు

ఉత్తమ నటుడు : విజయ్‌ సేతుపతి (మహారాజ)

ఉత్తమ నటి : సాయిపల్లవి (అమరన్‌)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : సీహెచ్‌ సాయి (అమరన్‌)

ఉత్తమ ఎడిటర్‌ : ఫిలోమిన్‌ రాజ్‌ (అమరన్‌)

ఉత్తమ బాలనటుడు : పొన్వెల్‌ (వాళై)

ఉత్తమ సహాయనటుడు: దినేశ్‌ (లబ్బర్‌ పందు)

ఉత్తమ సహాయనటి : దుషారా విజయన్‌ (వేట్ట‌య‌న్)

ఉత్తమ రచయిత : నిథిలన్‌ సామినాథన్‌ (మహారాజ)

ఉత్తమ సంగీత దర్శకుడు : జీవీ ప్రకాశ్‌ (అమరన్‌)

స్పెషల్‌ జ్యూరీ అవార్డు : మారి సెల్వరాజ్‌ (వాళై), పా.రంజిత్‌ (తంగలాన్‌)

editor

Related Articles