ముకుంద, కంచె సినిమాలతో టాలీవుడ్‌లో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత 2019లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేశ్.. 2022లో ఎఫ్ 3 తర్వాత వరుణ్ తేజ్ ఖాతాలో చెప్పుకునేంత సక్సెస్ సాధించిన సినిమాలేమీ లేవు. ఆ తర్వాత కెరీర్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన గద్దలకొండ గణేష్, ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరిచాయి. దీంతో 2023 ఇయర్ వరుణ్‌తేజ్‌కు ప్లాప్‌తోనే ముగిసింది. 2024 కూడా ఇదే సీన్ రిపీటైంది. ఈ ఏడాది ఎయిర్‌ఫోర్స్ డ్రామా నేపథ్యంలో నటించిన ఆపరేషన్ వాలెంటైన్ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. ఓ వైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుండే వరుణ్‌తేజ్‌కు 2025 ఇయర్ అయినా కలిసి రావాలని విష్ చేస్తున్నారు సినిమా లవర్స్.

- December 20, 2024
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor