అంకిత్ కొయ్య, శ్రియా కొంతం జంటగా రూపొందిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’. శ్రీహర్ష దర్శకుడు. సత్య నిర్మాత. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా స్నీక్ పీక్‌ను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మేకర్స్ లాంచ్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘సెన్సిబుల్ మెసేజ్ ఇస్తూనే ఆద్యంతం నవ్వించేలా సినిమా ఉంటుంది. ఇదో కొత్త కంటెంట్. అన్ని వయసులవారూ చూడదగ్గ సినిమా ఇది.’ అన్నారు. కొత్తవాళ్లమంతా కలిసి ఈ సినిమా తీశామని, హీరో అంకిత్‌కి మంచిపేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుందని దర్శకుడు నమ్మకంతో ఉన్నారు. ‘అమృతం’ సీరియల్‌లా అందరికీ నచ్చే సినిమా ఇదని, గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన హర్ష అనే కుర్రాడు, అక్కడ డోర్ లాక్ అవ్వడంతో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అనేది చాలా సరదా అనిపించేలా చూపించామని తెలుగమ్మాయి శ్రియ అద్భుతంగా నటించిందని, అందరూ ప్రాణం పెట్టి యాక్టింగ్ చేశారని హీరో అంకిత్ తెలిపారు.

- December 10, 2024
0
97
Less than a minute
You can share this post!
editor