ప్రస్తుతం మన టాలీవుడ్‌లో ఉన్న లేటెస్ట్ సినిమాల్లో యూత్ ఫుల్ క్రేజీ సీక్వెల్ సినిమా మ్యాడ్ స్క్వేర్ కూడా ఉంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తమ మ్యాడ్ బాయ్స్ నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్‌ల కలయికలో తెరకెక్కించిన మ్యాడ్‌కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు అలా పెరుగుతూ వస్తున్నాయి. ఇక రీసెంట్‌గా వచ్చిన టీజర్‌తో కూడా సాలిడ్ హైప్ నెలకొనగా ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ విషయంలో సంగీత్ శోభన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. లాస్ట్ టైం నిర్మాత నాగవంశీ తమ మ్యాడ్ సినిమా చూసి ఎవరికైనా నవ్వు రాకపోతే పెట్టిన టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని చెప్పారని ఈసారి మ్యాడ్ స్క్వేర్‌కి గాని నవ్వు రాకపోతే డబుల్ పేమెంట్ ఇస్తారని నాగవంశీ అన్న అంటూ ఈ సినిమా విషయంలో తాము ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అనేది అర్ధం అవుతోంది. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తుండగా ఈ మార్చి నెల 29న గ్రాండ్‌గా సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది.

- March 1, 2025
0
49
Less than a minute
Tags:
You can share this post!
editor