Movie Muzz

పవన్ హుందాగా ఉంటారు..నటి శ్రియా రెడ్డి

పవన్ హుందాగా ఉంటారు..నటి శ్రియా రెడ్డి

2006లో విడుదలైన ‘పొగరు’ సినిమాలో నెగటివ్ పాత్రలో నటించి తెలుగు వారికి చేరువయ్యారు నటి శ్రియా రెడ్డి. గతేడాది సలార్‌తో మనల్ని అలరించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తూన్న చిత్రం ‘ఓజి’ లో నటిస్తున్నారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “ ఓజీలో నా పాత్ర చాలా ప్రత్యేకం. సలార్‌లోని పాత్రకు విభిన్నంగా ఉంటుంది. స్క్రీన్‌పై  నన్ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు” అని తెలిపారు.

          అనంతరం పవన్ కల్యాణ్‌తో ఇప్పటికే కొన్ని సన్నివేశాల్లో నటించిన ఆమె, “ ఆయన ఎంతో హుందాగా ఉంటారు. ఆయన ప్రవర్తన, మాట్లాడే విధానం చూడచక్కగా ఉంటాయి. ఆయన చాలా తెవివైన, మర్యాద గల వ్యక్తి” అని తెలిపారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

editor

Related Articles