నాకు వరుసగా సినిమాలు చేయాలని లేదు: నిధి అగర్వాల్‌

నాకు వరుసగా సినిమాలు చేయాలని లేదు: నిధి అగర్వాల్‌

హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ గురించి తన సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. ఆమెను శ్రీలీలతో పోలుస్తూ.. ‘2019లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత ఈమె ఏం చేసింది? ఎన్ని సినిమాలు చేసింది? 2021లో వచ్చిన శ్రీలీల ఇప్పటికి 20 సినిమాలు చేసింది.’ అని వెటకారంగా రాసుకొచ్చాడు. ఆ పోస్ట్‌ నిధి అగర్వాల్‌ కంటపడింది. దాంతో ఆమె తనదైన శైలిలో స్పందించింది.  ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత తెలుగు, తమిళం కలిపి మూడు, నాలుగు సినిమాలు చేశా. ‘హరిహర వీరమల్లు’, ‘ది రాజాసాబ్‌’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మంచి స్క్రిప్ట్‌ అనుకుంటేనే సంతకం చేస్తున్నా. నాకు వరుసగా సినిమాలు చేయాలని లేదు. మంచి సినిమాల్లో భాగం కావడమే నాకు ముఖ్యం. ఇండస్ట్రీలో చాలాకాలం ఉండాలనుకుంటున్నా. కాబట్టి.. బ్రదర్‌ నా గురించి నువ్వేమీ బాధ పడకు..’ అంటూ కౌంటర్‌ ఇచ్చింది నిధి అగర్వాల్‌.

editor

Related Articles