అవి చిన్న,పెద్ద సినిమాలా అని కాదు? హిట్టైందా లేదా?

అవి చిన్న,పెద్ద సినిమాలా అని కాదు? హిట్టైందా లేదా?

ఓవైపు సినిమాలు, మరోవైపు సిరీస్‌తో బిజీగా ఉన్నారు హీరోయిన్ తమన్నా. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నాకు.. ‘ఆఫర్లు లేకపోవడంతో చిన్న సినిమాల్లో నటిస్తున్నారా?’ అనే ప్రశ్న ఎదురైంది. తమన్నా మాట్లాడుతూ నా దృష్టిలో చిన్న, పెద్ద సినిమాలు అనేది ఉండదు. ఓ తక్కువ బడ్జెట్‌ సినిమా కంటెంట్‌ బావుండి హిట్‌ అయితే.. అదే పెద్ద సినిమా. ఓ భారీ బడ్జెట్‌ సినిమా కంటెంట్‌ బాగుండక ఫ్లాప్‌ అయితే.. అది ఆటోమేటిగ్గా చిన్న సినిమా అయిపోతుంది. కెరీర్‌ తొలినాళ్లలో ‘హ్యాపీడేస్‌’ చేశా. అందులో ఎనిమిదిమంది ప్రధాన పాత్రధారుల్లో నేనూ ఒకదాన్ని. ఆ సినిమా మీ దృష్టిలో చిన్న సినిమానా? పెద్ద సినిమానా? ఆ సినిమా బడ్జెంట్‌ ఎంత? రాబట్టింది ఎంత? రీసెంట్‌గా ‘స్త్రీ 2’లో ప్రత్యేక గీతంలో నర్తించా. నాకు డాన్స్‌ అంటే ఇష్టం కాబట్టే చేశా. నిజానికి ఆ సినిమాలో హీరోనే లేడు. కానీ 900 కోట్లు వసూలు చేసింది. అది చిన్న సినిమానా? పెద్ద సినిమానా? ఇక్కడ హిట్‌ అవ్వడం ముఖ్యం.’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

editor

Related Articles