ఆ నెంబర్ నాదే..కోటి రూపాయలు కట్టండి..

ఆ నెంబర్ నాదే..కోటి రూపాయలు కట్టండి..

ఇటీవల విడుదలై విజయవంతమైన అమరన్ చిత్రం వల్ల తనకు చాలా ఇబ్బంది కలిగిందని, అందుకే తనకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు విఘ్నేషన్ అనే విద్యార్థి. శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం వల్ల తనకు సాయిపల్లవి ఫ్యాన్స్‌ ఇబ్బంది కలిగిస్తున్నారని, మానసిక వేదనకు గురయ్యానని పేర్కొన్నారు. ఈ చిత్రంలో మేజర్ ముకుంద్ వరదరాజన్, ఇందు రెబెకాల  జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కింది ఈ చిత్రం. దీనిలో ఇందుగా నటించిన సాయిపల్లవి హీరోకు ఒక నెంబర్ ఇస్తుంది. ఆ ఫోన్ నెంబర్ తనదేనని విఘ్నేషన్ పేర్కొన్నారు. ఈ నెంబర్ వల్ల తనకు ప్రశాంతత లేకుండా పోయిందని, వరుస ఫోన్ కాల్స్, సందేశాల వల్ల తనకు వ్యక్తిగత ప్రశాంతత లేకుండా పోయిందని ఆయన వాపోయాడు. అందుకే చిత్రబృందం తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

editor

Related Articles