మనసు దోచేసిన ధనుష్ ట్రైలర్..?

మనసు దోచేసిన ధనుష్  ట్రైలర్..?

ధనుష్ హీరోగా నటించిన ‘కర’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దర్శకుడు విఘ్నేశ్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. ట్రైలర్‌లో బ్యాంక్ దోపిడీలు, పోలీసుల అనుమానాలు, హీరోపై ఉన్న సందేహాలు కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. ధనుష్ పాత్ర చాలా డిఫరెంట్‌గా కనిపిస్తూ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు.

గల్ఫ్ దేశాల యుద్ధ పరిస్థితులు, రైతుల సమస్యలు, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలను కూడా సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్‌లో కనిపిస్తోంది. జి.వి. ప్రకాష్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

ఇప్పటికే టీజర్‌తో మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా, ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది. ఏప్రిల్ 30న తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

Related Articles