సోషల్ మీడియా వేదికగా విషపూరితమైన పోస్టులు పెట్టేవారిపై తమిళ నటి త్రిష ఆగ్రహం వ్యక్తం చేసింది. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది త్రిష. ఈ సినిమా విషయంలో త్రిష వ్యక్తిగత జీవితాన్ని లాగి కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది త్రిష. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. విషపూరితమైన వ్యక్తులారా, అసలు మీ జీవితం ఎలా ఉంటుంది మీ జీవితంలో బాగా నిద్రపోతారా? సోషల్ మీడియాలో కూర్చొని ఇతరుల గురించి అర్థంలేని విషయాలు పోస్ట్ చేయడం నిజంగా మీకు సంతోషంగా అనిపిస్తోందా. ఇతరుల గురించి నీచమైన పోస్టులు పెట్టే మీలాంటి వారికి, మీతో మీ పక్కనున్న వారికి చాలా ప్రమాదం. గుర్తుతెలియని ఈ పిరికిబందలను చూస్తుంటే బాధగా ఉంది. వీరిని దేవుడే రక్షించాలంటూ త్రిష రాసుకొచ్చింది.
											- April 11, 2025
 
				
										 0
															 61  
															  Less than a minute 
										
				
			
				Tags:			
		You can share this post!
editor
				
