కన్నడ హీరో యశ్ కాంపౌండ్ నుండి వస్తోన్న ప్రాజెక్ట్ టాక్సిక్. ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాకి పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కె.నారాయణ తెరకెక్కిస్తున్నారు. యశ్ 19వ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఫ్యాన్స్, సినిమా లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ సినిమాని ఒకేసారి రెండు భాషల్లో షూట్ చేయనున్నారు. టాక్సిక్‌ను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించనున్నారు. యశ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. నయనతార, బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి, తారా సుటారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రదర్ – సిస్టర్ కథతో 1970స్ గోవా, కర్ణాటక బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా సాగనుందని ఇన్‌సైడ్ టాక్. ఇప్పటికే నిర్మాతలు వింటేజ్ టాక్సీ, రౌండప్ క్యాప్ పెట్టుకున్న యశ్ ప్రీ లుక్ విడుదల చేయగా సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.

- February 24, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor