శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నటిస్తోన్న సినిమా హిట్ 3. నాని పాత్రపై గ్లింప్స్ విడుదల చేయగా.. మంచు పర్వతాల మధ్య కారుతో దూసుకుపోతున్న హిట్ ఆఫీసర్‌ని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఛేజ్ చేస్తున్న సన్నివేశాలు హైప్ క్రియేట్ చేస్తున్నాయి. టాలీవుడ్ హీరో నాని నటిస్తోన్న సినిమాల్లో ఒకటి హిట్ ప్రాంఛైజీ హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న హిట్ 3లో అర్జున్ సర్కార్‌గా కనిపించబోతున్నాడు నాని. నాని పాత్రపై గ్లింప్స్ విడుదల చేయగా.. తాజాగా నిర్మాతలు టీజర్‌ను లాంచ్ చేశారు. సార్ మీకు ప్రాబ్లమ్ లేదంటే ఒక పేరు చెబుతా.. అర్జున్ సర్కార్.. అంటూ సాగే డైలాగ్స్‌తో షురూ అయింది టీజర్. ఈ కేసు ఆడికివ్వడంలో ప్రాబ్లమ్స్ ఏం లేదు గానీ.. వీడి లాఠీకి దొరికినోడి పరిస్థితి ఆలోచిస్తే భయమేస్తోందని ఉన్నతాధికారి హోదాలో ఉన్న రావు రమేష్ అంటుండగా.. మరోవైపు డ్యూటీలో చేరిన అర్జున్ సర్కార్ అందరూ ఒకే మెథడ్‌లో మర్డర్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉందంటున్నాడు. మొత్తానికి మిస్టరీ కేసులను అర్జున్ సర్కార్‌గా లాఠీకి పనిచెబుతూ ఎలా చేధించాడనే నేపథ్యంలో ఆసక్తికరంగా సినిమా ఉండబోతున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ సినిమాని 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

- February 24, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor