వై.వి.ఎస్‌. చౌదరి డైరెక్షన్‌లో – ఎన్టీఆర్‌ సినిమా స్టార్ట్

వై.వి.ఎస్‌. చౌదరి డైరెక్షన్‌లో – ఎన్టీఆర్‌ సినిమా స్టార్ట్

వైవీఎస్ చౌదరి.. ఈ పేరు ఇప్పటితరం వారికి అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాస్ లాంటి సూపర్ హిట్ మాస్ సినిమాలను తెరకెక్కించింది ఈయనే. ఎంతోమంది హీరోలను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు నందమూరి తారక రామారావు కుటుంబం నుండి మరో కొత్త నటుడిని పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ నట వారసుల్లో నాలుగో తరం, నందమూరి హరికృష్ణ మనవడు (జానకిరామ్‌ కుమారుడు) అయిన నందమూరి తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. యలమంచిలి గీత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తెలుగమ్మాయి వీణ రావు హీరోయిన్‌గా నటించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించనుండగా, చంద్రబోస్ సాహిత్యం సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా నేడు తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్ వ‌ద్ద ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్‌లో పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది.

editor

Related Articles