మంచు విష్ణుతో – ప్రభుదేవా డైరెక్షన్‌లో..

మంచు విష్ణుతో – ప్రభుదేవా డైరెక్షన్‌లో..

 ‘కన్నప్ప’ విజయంతో మంచి జోష్‌ మీద ఉన్నారు హీరో మంచు విష్ణు. కెరీర్‌ పరంగా ఆయనకు మరో విజయం ఎంతైనా అవసరం. అందుకే.. తన నెక్ట్స్‌ సినిమా వైపు దృష్టి సారించారాయన. తన తదుపరి సినిమా పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు మంచు విష్ణు. తాజా సమాచారం ప్రకారం మంచు విష్ణు నెక్ట్స్‌ సినిమాకి నటుడు, స్టార్‌ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, శంకర్‌దాదా జిందాబాద్‌ చిత్రాలతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు ప్రభుదేవా. హిందీలోనూ ఆయన కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. డైరెక్షన్‌ విషయంలో కాస్త గ్యాప్‌ తీసుకున్న ఈ  కొరియోగ్రాఫర్‌ మంచు విష్ణు సినిమాతో మళ్లీ తిరిగి మెగాఫోన్‌ పట్టనున్నారు. ఇంకా పేరు నిర్ణయించని  ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది.

editor

Related Articles