వీరమల్లు ప్రమోషన్స్‌లో పవన్‌కళ్యాణ్  పాల్గొంటారా..?

వీరమల్లు  ప్రమోషన్స్‌లో  పవన్‌కళ్యాణ్  పాల్గొంటారా..?

హీరో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. క్రిష్ – జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ ఎపిక్ సినిమా తాజాగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. ఈ సినిమాలోని మూడో పాటని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాపై సాలిడ్ అంచనాలు ఉండగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌కు పవన్ కళ్యాణ్ వస్తాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవైపు OG షూటింగ్‌లో బిజీ.. మరోవైపు డిప్యూటీ సీఎం బాధ్యతలు.. ఇలా నిత్యం బిజీగా ఉన్న పవన్, వీరమల్లు ప్రమోషన్స్‌లో ఒక్కసారి కనిపిస్తే చాలు అని అభిమానులు ఆశిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

editor

Related Articles