టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతాయి. ఏ దర్శకుడు టచ్ చేయని కాన్సెప్టులతో క్రిష్ పలు సినిమాలు తెరకెక్కించాడు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లనే క్రిష్ స్టార్ డైరెక్టర్ కాలేపోయాడు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హరిహర వీరమల్లు అనే చిత్రం తెరకెక్కించగా, ఈ సినిమాతో క్రిష్ జాతకం మారిపోవడం ఖాయం అని అనుకున్నారు. 9 నెలల్లో ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేద్దామని చేసిన క్రిష్… ఫస్ట్ హాఫ్‌ని చాలా తొందరగా పూర్తి చేశారు. కానీ మధ్యలో కరోనా మహమ్మారి విలయతాండవం, లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో సినిమాకి టైం కేటాయించలేకపోతున్నాడు. ఇక ఈ సినిమా నుండి తప్పుకున్న తర్వాత అనుష్కతో ఘాటి మొదలు పెట్టాడు. గత ఏడాది టీజర్ కూడా విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా చేసింది. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ గతంలో ప్రకటించారు. కాని సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఈ సినిమా పరిస్థితి అయోమయంలో పడింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై క్లారిటీ కూడా లేకుండా పోయింది. సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందా?, లేకపోతే క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడా?, దీనిని బట్టి క్రిష్ సినిమా నుండి తప్పుకుంటాడా, అందుకే సినిమా ఆగిపోయిందా అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. హరిహర వీరమల్లుని మధ్యలోనే వదిలిపెట్టేశారు. ఇక ఇప్పుడు ఘాటీని కూడా మధ్యలోనే వదిలేశారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
- April 23, 2025
0
63
Less than a minute
Tags:
You can share this post!
editor

