పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా జ్యోతికృష్ణ టేకప్ చేసి ఇటీవలే షూటింగ్ పూర్తి చేశారు. ఐదేళ్లుగా సెట్స్‌పై ఉన్న ఈ సినిమా జూన్ 12న విడుదల కానున్నదంటూ ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కాని ఆ సమయానికి కూడా మూవీ రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. అందుకు కారణం జూన్ 1 నుండి సినిమా థియేటర్లు బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని, పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామంటూ నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. మరి ఈ క్రమంలో జూన్ 1 నుండి సినిమా థియేటర్స్ బంద్ అయితే హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. జూన్‌లో హరిహర వీరమల్లుతో పాటు థగ్‌లైఫ్, కన్నప్ప, కుబేర, కింగ్‌డమ్ వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. అన్నీ పెద్ద సినిమాలే కాబట్టి వీలైనంత తొందరగా ఈ సమస్య సాల్వ్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. చివరికి జూన్ 12న రిలీజ్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
- May 19, 2025
0
109
Less than a minute
Tags:
You can share this post!
editor

