ఒక‌ప్పుడు స్లిమ్‌గా ఉండే నివేదా థామ‌స్ ఎందుకింత బొద్దుగా తయారయ్యిందో..?

ఒక‌ప్పుడు స్లిమ్‌గా ఉండే నివేదా థామ‌స్ ఎందుకింత బొద్దుగా తయారయ్యిందో..?

హీరోయిన్ నివేదా థామ‌స్ తెలుగులో వైవిధ్య‌మైన సినిమాలతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. అయితే నివేదా థామ‌స్ అద్భుత‌మైన న‌ట‌న‌కి ఆమెకి బెస్ట్ ఫిమేల్ లీడ్‌గా గ‌ద్ద‌ర్ అవార్డ్ ద‌క్కింది. 35 చిన్న క‌థ కాదు అనే సినిమాతో ఈ అవార్డ్ ద‌క్కించుకుంది నివేదా. అయితే అవార్డ్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన స‌మ‌యంలో నివేదా లుక్ అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్ర‌స్తుతం నివేదా థామస్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలు చూసి ఎందుకామె అంత బరువు పెరిగిందంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. 35 చిన్న క‌థ కాదు సినిమాలో తల్లి పాత్ర కోసమే నివేదా థామస్ అప్పట్లో బరువు పెరిగిందని, ఇక తగ్గడం కష్టంగా మారిందని అంటున్నారు. ఆ పాత్రకు తన బాడీ ట్రాన్స్ ఫార్మ్‌తో న్యాయం చేశానని కూడా గతంలో నివేదా బదులిచ్చింది. ఇక బరువు పెరగడానికి రీజన్ మాత్రం ఆ సినిమానే అని చెప్పుకొస్తున్నారు. మ‌రికొంద‌రు నివేదాకి థైరాయిడ్ స‌మ‌స్య ఉంద‌ని అందుకే అంత లావైంద‌ని అంటున్నారు. మ‌రి దీనిపై నివేదా ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.

editor

Related Articles