టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాల కన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. నాగ చైతన్యని ప్రేమించి పెళ్లిచేసుకున్న సమంత అనూహ్యంగా అతని నుండి విడిపోవడం అభిమానులని చాలా బాధించింది. చూడ చక్కనైన జంట విడిపోవల్సిన పరిస్థితి ఏంటి అనే దానిపై చాలామంది ఆరాలు తీశారు కాని ఇప్పటి వరకు దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉందని త్వరలో ఆయనని రెండో వివాహం చేసుకోనుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే సమంత గురించి ఈ మధ్య నెట్టింట జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అమ్మడికి సంబంధించి ఏదో ఒక విషయం హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా సమంత టాటూకి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సమంత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన మొదటి టాటూ గురించి మాట్లాడింది. “నేను 18 ఏళ్ల వయసులో టాటూ వేసుకున్నా. అప్పుడంటే నేను ప్రేమలో ఉన్నాను, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని భావించా. అందుకే టాటూ వేసుకున్నాను. అయితే, ఆ టాటూ ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పనని స్పష్టం చేసింది. ఆ వివరాలు చెప్పడం ఇష్టం లేదని కూడా పేర్కొంది. అదే సమయంలో ఎవరిని ప్రేమించారో కూడా చెప్పలేదు. ప్రస్తుతం సమంత కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతున్నాయి.
- July 4, 2025
0
129
Less than a minute
Tags:
You can share this post!
editor

