సైఫ్‌పై దాడితో అండర్‌వరల్డ్‌కు లింకు లేదని ఆ రాష్ట్ర మంత్రి యోగేష్ కడమ్ పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన దుండగుడు ఇంకా పోలీసులకు చిక్కలేదు. అతని కోసం ముంబై పోలీసు శాఖకు చెందిన 30 బృందాలు ఇంకా గాలిస్తున్నాయి. అటాకర్‌కి ఎటువంటి క్రిమినల్ గ్యాంగ్‌లతో సంబంధాలు లేవన్నారు. అసలు ఎవరి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడన్న విషయంలో కూడా ఆ వ్యక్తికి క్లారిటీ ఉండకపోవచ్చు అని పోలీసులు తెలిపారు. సైఫ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి పోలికలతో ఉన్న ఓ కార్పెంటర్‌ను అదుపులో తీసుకున్న పోలీసులు. బాంద్రా పోలీసు స్టేషన్‌లో అతణ్ణి విచారించిన తర్వాత రిలీజ్ చేశారు. ఖాన్‌పై జరిగిన అటాక్‌తో అతనికి సంబంధం లేదన్నాడు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఫొటో సీసీటీవీ ఫుటేజ్‌కు చిక్కింది. దొంగతనం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ వ్యక్తి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు మహారాష్ట్ర మంత్రి యోగేశ్ కడమ్ తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో సైఫ్‌ని డిశ్చార్జ్ చేయవచ్చు.

- January 18, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor