కుంభమేళాలో సన్యాసం తీసుకున్న న‌టి ఎవరు?

కుంభమేళాలో సన్యాసం తీసుకున్న న‌టి ఎవరు?

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళ‌లో న‌టి మ‌మ‌త కుల‌క‌ర్ణి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌న జీవితం దేవుడికి అంకింతం అంటూ సన్యాసం పుచ్చుకుంది. ఉత్తరప్రదేశ్‌, అలహాబాద్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మాజీ నటి మమతా కులకర్ణి స‌న్యాసం పుచ్చుకుంది. జ‌న‌వరి 24న మహాకుంభమేళాకు వెళ్లిన ఆమె మహామండలేశ్వర్‌గా మారుతున్నట్లు ప్రకటించింది. త‌న జీవితం దేవుడికి అంకింతం ఇస్తూ.. ఇక నుండి ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించాలి అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా తన పేరును శ్రీ యామై మమత నందగిరిగా మార్చుకుంది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు అగ్ర‌తార‌గా వెలుగు వెలిగింది మమతాకులకర్ణి. తాను న‌టించిన క‌ర‌ణ్ అర్జున్, క్రాంతివీర్, సబ్‌సే బడా ఖిలాడి, కిస్మత్‌, నజీబ్ సూప‌ర్ హిట్ కావ‌డంతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా ప్రేమ శిఖ‌రంతో పాటు మోహ‌న్ బాబు హీరోగా వ‌చ్చిన దొంగా పోలీస్ సినిమాలో న‌టించింది ఈ హీరోయిన్. అయితే స‌డ‌న్‌గా తాను న‌ట‌నకు గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్‌లో పడేసింది. ఇక 20 ఏళ్ల క్రితం న‌ట‌న‌ను వ‌దిలేసి విదేశాల్లో వెళ్లి స్థిర‌ప‌డింది మ‌మ‌త.. తాజాగా మ‌హాకుంభ‌మేళాలో క‌న‌ప‌డ‌డం.. స‌న్యాసం తీసుకోవ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

editor

Related Articles