ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సీ దర్శకత్వంలో విశాల్ హీరోగా వచ్చిన సినిమా ‘మదగజరాజ’. 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 12 ఏళ్ల తర్వాత రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ కథానాయకుడు విశాల్ ప్రధాన పాత్రధారిగా నటించిన సినిమా ‘మదగజరాజ’. సుందర్ సీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 12 ఏళ్ల తర్వాత రీసెంట్‌గా తమిళంలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయవంతంగా నడుస్తోంది తమిళనాడులో. ఇప్పటికే తమిళంలో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే తెలుగులో విడుదల చేస్తున్నారు మేకర్స్. జనవరి 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విశాల్‌తో పాటు సంతానం పండించిన కామెడీ టచ్‌తో ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

- January 25, 2025
0
23
Less than a minute
Tags:
You can share this post!
editor