ఇక ‘కింగ్‌డమ్’ పై రిలీజ్ డేట్ క్లారిటీ ఎప్పుడు?

ఇక ‘కింగ్‌డమ్’ పై రిలీజ్ డేట్ క్లారిటీ ఎప్పుడు?

విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ సినిమాయే “కింగ్‌డమ్”. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో సాలిడ్ హైప్‌ని సెట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కూడా కొంచెం సస్పెన్స్‌గానే మారింది. ఇక ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ దీనిపై క్లారిటీ కోరుకుంటున్నారు. అయితే ఈ జూలై 4కి లాక్ అయిన సినిమా ప్రస్తుతం ఎలాంటి చప్పుడు చేయడం లేదు. సో వాయిదా అనేది కన్‌ఫర్మ్ అయ్యింది. కానీ ఇంకోపక్క జూలై 24 లేదా 25న హరిహర వీరమల్లుతో క్లాష్ ఉంటుంది అనేది బయటకి వచ్చింది. ఇందులో పవన్ సినిమా డేట్ జూలై 24 కి ఫిక్స్ అయ్యింది. ఇక కింగ్‌డమ్ నుండి రిలీజ్ క్లారిటీ రావడం అనేది ఒకటి బాకీ ఉందని చెప్పాలి. మరి మేకర్స్ ఎప్పుడు దీనిపై క్లారిటీ ఇస్తారో చూడాల్సిందే. ఇక ఈ సినిమా రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేస్తారో, లేక అన్న డేట్‌కే రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.

editor

Related Articles