సినీ రంగానికి స‌హ‌క‌రిచేందుకు మేమెప్పుడు సిద్ధ‌మే.. కందుల దుర్గేష్

సినీ రంగానికి స‌హ‌క‌రిచేందుకు మేమెప్పుడు సిద్ధ‌మే.. కందుల దుర్గేష్

జూన్ 1 నుండి థియేట‌ర్స్ బంద్ చేస్తామంటూ ఇటీవ‌ల జ‌రిగిన ప్రచారం స‌మ‌యంలో ఏపీ సినిమాటోగ్ర‌ఫీ కందుల దుర్గేష్ విచార‌ణ‌కి ఆదేశించిన విష‌యం తెలిసిందే. స‌రిగ్గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా రిలీజ్‌కి ముందే థియేట‌ర్స్ బంద్ చేయాల‌ని ఆ నలుగురు కుట్ర చేశారంటూ జ‌న‌సేన తీవ్రంగా ఆరోపించిన నేప‌థ్యంలో విచార‌ణ‌కి ఆదేశించారు. తాజాగా కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి, రాష్ట్రంలో సినిమా నిర్మాణ కార్యకలాపాలు పెంచేందుకు మా నుండి అన్ని స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని దుర్గేష్ అన్నారు. సినిమా షూటింగ్‌లకు అనుమతులు సులభతరం చేయడం, సింగిల్ విండో విధానాన్ని మరింత పటిష్టం చేయడం, అలాగే రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి సంబంధించిన అవకాశాలను పరిశీలిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న అన్నారు. టిక్కెట్ రేట్స్‌పై ద‌శాబ్ధ‌కాలంగా వివాదం న‌డుస్తోంది. అయితే నిర్మాత‌లు టిక్కెట్ రేట్స్ పెంచ‌మ‌ని కోరిన‌ప్పుడు పెంచుతామ‌ని తెలియ‌జేశారు.

editor

Related Articles