పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన అరాచకానికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టగా, ఇది విజయవంతమైన నేపథ్యంలో విజయవాడ నగరం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ జరగగా, ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు ఈ భారీ ప్రదర్శన కన్నుల పండువగా సాగింది. అయితే ఇక్కడ అందరి దృష్టి పవన్‌కళ్యాణ్ చేతిపైనే ఉంది. అందుకు కారణం పవన్ ఎప్పుడు పచ్చబొట్టు పొడిపించుకుంది లేదు. ఆ మధ్య పవన్ చేతిపై త్రిశూలం టాటూ కనిపించింది. త్రిశూలం ఎందుకు వేసుకొన్నారనే విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపింది. కాస్త ఆరా తీస్తే ఆ టాటూ హరిహర వీరమల్లు కోసం వేసుకున్నారని తెలిసింది. ఇక తిరంగా ర్యాలీలో పాల్గొన్న పవన్ చేతిపై కొత్త పచ్చబొట్టు కనిపించింది. ఆయన చేతిపై ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై అనేక ఊహగానాలు వెలువడ్డాయి. ఆ టాటూ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటని.. ఆ టాటూకి అర్థం ఏంటని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓజీ సినిమా కోసమే పవన్ కళ్యాణ్ ఆ టాటూ వేయించుకున్నారని , టాటూ మీనింగ్ కూడా ఓజీనే అని అంటున్నారు.
- May 17, 2025
0
201
Less than a minute
Tags:
You can share this post!
editor

