ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో రామ్ చరణ్, విజయ్ దేవరకొండ గెస్ట్‌లుగా హాజరయ్యారు. మాదకద్రవ్యాల నివారణ పోరాటంలో అందరం ఐక్యంగా నిలబడాలని వాటిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా పోరాడాలంటూ పిలుపునిచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అయితే కార్యక్రమం చివర్లో అందరూ డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రమాణం చేశారు. ఈ సమయంలో రామ్ చరణ్ కొద్దిగా అసౌకర్యంగా ఉన్నట్టు వీడియోల్లో కనిపించింది. ముఖ్యంగా ఆయన చేతికి ఉన్న కట్టు అభిమానులను ఆందోళనకు గురిచేసింది. వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో, రామ్ చరణ్‌కు ఏమైంది? ఎందుకు బ్యాండేజ్ కట్టుకున్నారు? అనే సందేహాలు అభిమానులలో ఊపందుకున్నాయి. కొంతమంది ఈ గాయం ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో తలెత్తిందని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ గాయం గురించి అధికారికంగా ఏ సమాచారం వెలువడలేదు. అయితే గాయం అంత తీవ్రమైందిగా కనిపించడం లేదు.
- June 27, 2025
0
61
Less than a minute
Tags:
You can share this post!
editor

