హీరో అమీర్‌ఖాన్ ఇప్పుడు ఒక సరైన హిట్ కోసం స్ట్రగుల్ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే తన నుండి రీసెంట్ ప్లాప్స్ తర్వాత వస్తున్న మరో సినిమాయే ‘సితారే జమీన్ పర్’. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పానిష్ సినిమా ఛాంపియన్స్‌కి రీమేక్‌గా తెరకెక్కింది. మరి ఈ సినిమాపై నార్త్ ఆడియెన్స్ దృష్టి పడేలా ఉందని తెలుస్తోంది. మెయిన్‌గా ఇటీవల జరిగిన పహల్గామ్ దాడితో సహా ఆపరేషన్ సింధూర్ పట్ల బాలీవుడ్ స్టార్స్ చూపించిన వైఖరి పట్ల ఆడియెన్స్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ మరోలా ఉంటుందని నెటిజన్స్ అంటున్నారు. అప్పుడు స్పందించని అమీర్‌ఖాన్ సరిగ్గా సినిమా రిలీజ్ ముందు మొసలి కన్నీరు కార్చితే ఎవరూ నమ్మరని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే రిలీజ్‌రోజు అసలైన ఎఫెక్ట్ అమీర్‌ఖాన్ సినిమాపై పడటం చూస్తారని అంటున్నారు. మరి కలెక్షన్ల పరంగా ఆడియెన్స్ ఆదరణ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వచ్చే నెల జూన్ 20తో తేలిపోతుంది.
- May 17, 2025
0
58
Less than a minute
Tags:
You can share this post!
editor

