“మంగళవారం” కి సీక్వెల్‌ సినిమా తీయబోతున్నాం!

“మంగళవారం” కి సీక్వెల్‌ సినిమా తీయబోతున్నాం!

మన టాలీవుడ్ నుండి వచ్చిన పలు హిట్ చిత్రాల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఆ సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ అలాగే తన డెబ్యూ దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా “మంగళవారం” కూడా ఒకటి. అయితే ఈ సినిమాకి కూడా మేకర్స్ సీక్వెల్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ బదులుగా వేరొక హీరోయిన్ ఉండబోతోందిట. ఈసారి ఆ పాత్రకు కొత్త నటి కనిపిస్తుంది అని ఒక టాక్. అలాగే ప్రస్తుతం అజయ్ భూపతి పార్ట్ 2 స్క్రిప్ట్‌ని కంప్లీట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇలా అతి త్వరలోనే షూటింగ్ మొదలు కానుందట. మరి ఈసారి కనిపించేది ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ మున్ముందు తెలుస్తుంది.

editor

Related Articles