హృతిక్‌రోషన్, జూ.ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్-2’ ప్రమోషన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్ హిందీలో నేరుగా నటించిన ఫస్ట్ పిక్చర్ ఇదే కావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలిచాయి. ఎన్టీఆర్, హృతిక్‌రోషన్ నువ్వానేనా అనే రీతిలో పోటాపోటీ నటనను కనబరిచారు. ‘ఎవరూ చేయలేని పనిని నేను చేసి చూపిస్తాను. ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను, నేను యుద్ధంలో ఆయుధాన్ని.. చస్తా లేదా చంపుతా’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందించిన ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం చేపట్టారు.
- July 26, 2025
0
154
Less than a minute
Tags:
You can share this post!
administrator

