వరుణ్ ధావన్ లీడ్ రోల్‌లో యాక్ట్ చేస్తున్న సినిమా బేబీ జాన్. నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. బేబిజాన్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుండగా.. వరుణ్ ధావన్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. బేబిజాన్ నుండి లాంచ్ చేసిన Nain Matakka సాంగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాట ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తాజాగా ఇదే పాటకు అందాల భామలు వామికా గబ్బి, మిల్కీ బ్యూటీ తమన్నా డ్యాన్స్ చేశారు. వామికా, తమన్నా సూపర్ స్టైలిష్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తుంది. Kalees డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని సినీ1 స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియాఅట్లీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
- December 20, 2024
0
148
Less than a minute
Tags:
You can share this post!
editor


