‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మళ్లీ చిరంజీవి – బాబీ

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మళ్లీ చిరంజీవి – బాబీ

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత, మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు బాబీ కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్‌లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నవంబర్ 5వ తేదీని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించ‌నున్నార‌న్న‌ సమాచారం సినిమా వర్గాల నుండి వెల్లడైంది. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్‌ని ఎంపిక చేశారు. ఇప్పటికే ప్రభాస్ సరసన నటించి, ‘తంగలాన్’లో విక్రమ్, మలయాళంలో మోహన్‌లాల్ వంటి సీనియర్ స్టార్లతో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న మాళవిక, ఇప్పుడు మెగాస్టార్‌తో జతకట్టే అవకాశం దక్కించుకుంది.
ప్ర‌ముఖ కన్నడ నిర్మాణ సంస్థ నిర్మించ‌నున్న ఈ సినిమాకి ‘మిరాయ్’ చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనుండడం విశేషం. చిరంజీవి పుట్టినరోజున అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మ‌ల‌యాళ బ్యూటీ మాళ‌విక ఇటీవ‌ల వ‌రుస‌గా తెలుగు ప్రాజెక్ట్స్‌లో చోటు ద‌క్కించుకుంటుండ‌డం చూస్తుంటే రానున్న రోజుల‌లో ఈ హీరోయిన్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీని షేక్ చేయడం ఖాయమనిపిస్తోంది. మరోవైపు బాబీ – చిరు సినిమాలో రాశీ ఖన్నా కూడా నటించనుందని సమాచారం.

editor

Related Articles