బిగ్ బాస్ ప్రీ షో కోసం వెయిటింగ్‌…

బిగ్ బాస్ ప్రీ షో కోసం వెయిటింగ్‌…

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ సెప్టెంబర్ 7 నుండి గ్రాండ్ లాంచ్ కానుండ‌గా, దానికి ముందు ప్రత్యేక ప్రీ-షో ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ షో షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఆగస్టు 22, 2025 నుండి బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ప్రీ-షో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ షో ప్రతిరోజు ఒక గంట పాటు ప్రసారం అవుతుంది. ఆగ‌స్ట్ 22 నుండి సెప్టెంబర్ 4 వరకు అంటే సరిగ్గా రెండు వారాలపాటు ఈ ప్రత్యేక ప్రీ-షో నడవనుంది. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ప్రవేశించేందుకు 45 మంది కామన్ పీపుల్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే రెండు ఎలిమినేషన్లు కూడా జరిగిపోయినట్లు సమాచారం. ఈ 45 మందిలో కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. అయితే చివరకు ఆరుగురు మాత్ర‌మే తమ టాలెంట్‌తో హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా కంటెస్టెంట్ల ఎంపిక జరగలేదు, ఇది పూర్తిగా కొత్త ఫార్మాట్ మాదిరిగా క‌నిపిస్తోంది. షోకు ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

editor

Related Articles