రజనీకాంత్ కోసం కథ రెడీ చేసిన వివేక్‌ ఆత్రేయ!

రజనీకాంత్ కోసం కథ రెడీ చేసిన వివేక్‌ ఆత్రేయ!

హీరో రజనీకాంత్‌తో టాలీవుడ్‌ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఓ సినిమాని నిర్మించనున్నట్లు ఓ వార్త ఫిల్మ్‌ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. దేశంలోని హీరోలందరితో సినిమాలు చేయాలన్న సంకల్పంతో మైత్రీ మూవీమేకర్స్‌ ముందుకెళ్తున్నదని సంస్థ అధినేతలు నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పటికే బాలీవుడ్‌ హీరో సన్నీడియోల్‌తో ‘జాట్‌’, కోలీవుడ్‌ హీరో అజిత్‌తో ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రాలను నిర్మించిన మైత్రీ సంస్థ.. ఇప్పడు రజనీకాంత్‌తోనూ ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలుగులో డీసెంట్‌ సినిమాలు తీసిన ఓ యంగ్‌ డైరెక్టర్‌కి ఈ సినిమా బాధ్యతలు అప్పగించబోతున్నారనేది ఇన్‌సైడ్‌ వర్గాల టాక్‌. ఆ దర్శకుడెవరో కాదు.. వివేక్‌ ఆత్రేయ. సూపర్‌స్టార్‌ కోసం వివేక్‌ ఓ కథ రెడీ చేసుకున్నారట. త్వరలో రజనీకి ఆ కథ వినిపించబోతున్నారట. నిజానికి మైత్రీ సంస్థలో సినిమా చేసేందుకు రజనీ ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. అయితే.. దర్శకుడెవరనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. వివేక్‌ కథ సూపర్‌స్టార్‌కి నచ్చితే.. డైరెక్టర్‌ ఖరారైనట్టే. మెంటల్‌ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి వంటి డీసెంట్‌ హిట్‌లను తెరకెక్కించిన వివేక్‌ ఆత్రేయ.. ‘సరిపోదా శనివారం’తో కమర్షియల్‌గానూ విజయాన్ని అందుకున్నారు. సూపర్‌స్టార్‌ కోసం తాను తయారు చేసుకున్న కథ కూడా రజనీ మాస్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటుందని తెలుస్తోంది.

editor

Related Articles