టాలీవుడ్ హీరో విష్వక్‌సేన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మంచి టాలెంట్ ఉన్న విష్వక్‌సేన్ ఎందుకో సూపర్ హిట్స్ అందుకోలేకపోతున్నాడు. ఈ సారి మాత్రం గట్టిగా హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నాడు. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హజరై అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. హిట్ ఫ్రాంచైజీ ఫస్ట్ పార్ట్‌లో విష్వక్‌సేన్ నటించిన నేపథ్యంలో హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆహ్వానించారు. ఆయన్ను సుమ సరదాగా ఇంటరాగేషన్ చేశారు. ఆఫీసర్‌నే ఇంటరాగేషన్ చేస్తారా? అంటూ సుమను ప్రశ్నించాడు విష్వక్‌సేన్.. ఇప్పుడు ఆఫీసర్ అర్జున్ సర్కార్ కదా.. అని సుమ అనడంతో దీనికి ‘మా తెలంగాణ బ్రాంచ్‌లో నేనే కదా ఆఫీసర్‌ను’ అని విష్వక్‌సేన్ సరదాగా కామెంట్ చేశారు. ఈ మధ్యే నా వయస్సు 30కి చేరుకుందని, ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించి కూల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇక మీరు పెళ్లెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు?’ అని సుమ అడగ్గా.. మా అమ్మకు సంబంధాలు చూడమని మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. సో.. ఎప్పుడు పిల్ల దొరికితే అప్పుడు చేసుకుంటాను అని విష్వక్‌సేన్ చెప్పడంతో త్వరలో మనోడు కూడా పప్పు అన్నం పెట్టించబోతున్నాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
- April 28, 2025
0
64
Less than a minute
Tags:
You can share this post!
editor

