విశాల్ ‘మదగజరాజ’ జనవరి 12న విడుదల..

విశాల్ ‘మదగజరాజ’ జనవరి 12న విడుదల..

తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనక్కరలేని యాక్టర్‌ విశాల్‌. విశాల్‌ నటించిన సినిమాల్లో ఒకటి మదగజరాజ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విశాల్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాని సుందర్‌ సీ డైరెక్ట్ చేశాడు. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఫిమేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. సంతానం, సోనూసూద్‌ కీలక పాత్రల్లో నటించారు. 2013 పొంగళ్‌ కానుకగా జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడ్డది. 12 ఏళ్ల లాంగ్ గ్యాప్‌ తర్వాత థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. అజిత్‌కుమార్ నటించిన విదాముయార్చి సంక్రాంతి బరిలో నుండి తప్పుకోవడంతో విశాల్ టీం ఈ నిర్ణయం తీసుకుందట. ఈ సినిమాకి విజయ్‌ ఆంటోనీ సంగీతం అందించాడు. మరి దశాబ్ధం తర్వాత థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు సినీ ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన రాబోతుందనేది వేచి చూడాలి.

editor

Related Articles