ఆ హీరోతో వినాయక్ సినిమా.. నిజమేనా?

ఆ హీరోతో వినాయక్ సినిమా.. నిజమేనా?

హీరో సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌, వివి వినాయక్‌తో సినిమా చేయబోతున్నట్లు కొత్త గాసిప్ వినిపిస్తోంది. వివి వినాయక్ ఓ యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాను తీసేందుకు ప్లాన్ చేస్తున్నారని, ఈ సినిమాలో హీరో పాత్రకు సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌కి పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని, ఈ క్రమంలోనే వినాయక్, సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ను అప్రోచ్ అయ్యారని, మొత్తానికి తన సినిమాలో సిద్ధును హీరోగా తీసుకోవాలని వినాయక్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. దర్శకుడిగా వినాయక్‌కు భారీ ఇమేజ్ ఉన్నా.. ఆయన గతంలో ఎవర్‌గ్రీన్ సినిమాలు చేసినా.. గత కొంతకాలంగా వినాయక్‌కి సరైన హిట్ లేదు. పైగా ఆయన సినిమా చేసి చాలాకాలం అయింది. ఈ క్రమంలో వి.వి. వినాయక్, రవితేజతో ఓ సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య రూమర్స్ కూడా వినిపించాయి. అంతకుముందు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు రూమర్స్ వినిపించాయి. మళ్లీ ఇప్పుడు సిద్ధూకి వినాయక్ ఓ కథ చెప్పాడని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా వినాయక్ గత కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయారు.

editor

Related Articles