Movie Muzz

విజయ రామరాజు హీరోగా ‘అర్జున్‌ చక్రవర్తి’

విజయ రామరాజు హీరోగా ‘అర్జున్‌ చక్రవర్తి’

విజయ రామరాజు టైటిల్‌ రోల్‌ చేసిన స్పోర్ట్స్‌ డ్రామా ‘అర్జున్‌ చక్రవర్తి’. విక్రాంత్‌ రుద్ర దర్శకుడు. శ్రీని గుబ్బల నిర్మాత. విడుదలకు ముందే 46 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్‌ చెబుతున్నారు. ఆదివారం ‘అర్జున్‌ చక్రవర్తి’ యాంథమ్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. విక్రాంత్‌ రుద్రా రాసిన ఈ పాటను విఘ్నేష్‌ భాస్కరన్‌ స్వరపరిచారు. దీపక్‌ బ్లూ, బృథ్వీవ్‌ సత్యకుమార్‌, విఘ్నేష్‌ పాయ్‌ కలిసి ఆలపించారు. విజయరామరాజు ఫిజికల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అవుతున్న విజువల్స్‌, వండర్‌ఫుల్‌ లొకేషన్స్‌ ఈ పాటలో చూడొచ్చు. హర్షరోషన్‌, అజయ్‌, అజయ్‌ఘోష్‌, దయానంద్‌రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

administrator

Related Articles