డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత తన కొత్త సినిమా బెగ్గర్‌ని విజయ్ సేతుపతి హీరోగా పూరి ప్రకటించాడు. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో స్టార్ అతిథి పాత్ర కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఆ అతిథి పాత్రలో నాగార్జున కనిపించబోతున్నట్లు తాజాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో నాగార్జున – పూరి కలయికలో “సూపర్”, “శివమణి” లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. కాబట్టి, విజయ్ సేతుపతి బెగ్గర్‌లో నాగ్ గెస్ట్‌గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఐతే, ఈ వార్తపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మొత్తానికి పూరి ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఐతే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి, విజయ్ సేతుపతి కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి.

- May 26, 2025
0
167
Less than a minute
Tags:
You can share this post!
editor