విజయ్ – రష్మిక జంట మళ్లీ కలసింది!

విజయ్ – రష్మిక జంట మళ్లీ కలసింది!

టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రూమర్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ప్రేమకథపై త్వ‌ర‌లోనే పూర్తి క్లారిటీ రానుంది. ఇద్దరూ చాలాకాలంగా డేటింగ్‌ చేస్తున్నారని, తాజాగా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని టాలీవుడ్‌ వర్గాలు ధృవీకరించాయి.
అధికారికంగా ప్రకటించకపోయినా, విజయ్ – రష్మిక టీమ్‌ మీడియాకు సమాచారం అందించడంతో ఈ వార్త వైరల్‌ అయ్యింది. అదీకాక, వీరిద్దరూ కొత్తగా కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. రష్మిక తాజా సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో రష్మిక బిజీగా ఉంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్‌గా హాజరవుతాడని టాలీవుడ్‌లో టాక్.. దీంతో నిశ్చితార్థం తర్వాత మొదటిసారి విజయ్ – రష్మిక ఒకే స్టేజ్‌పై కలిసి కనిపించబోతున్నారని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

editor

Related Articles