అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించిన 43వ వార్షిక ఇండియా డే పరేడ్ గ్రాండ్‌గా జరిగింది. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ ఉత్సవాలుగా జరుపుకునే క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రతి సంవత్సరం ఈ పరేడ్‌ను నిర్వహిస్తూ వస్తోంది. భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికాలో అతిపెద్ద భారతీయ పరేడ్ అయిన “ఇండియా డే పరేడ్” అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వేలాదిమంది భారతీయ అమెరికన్లు, విదేశీ స్నేహితులు హాజరయ్యారు. ప్రముఖ సినీతారలు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి 2025 సంవత్సరానికి గాను “గ్రాండ్ మార్షల్స్”గా హాజరై పరేడ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతినిధిగా చాటి చెప్పారు. వేదికపై కాంగ్రెస్ సభ్యుడు థానేదార్, న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, పార్లమెంటు సభ్యుడు సత్నామ్ సింగ్ సంధు తదితర ప్రముఖులు పాల్గొని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయుల ఐక్యత, శ్రమ, సంస్కృతి విశిష్టతను వారు కొనియాడారు. “భారత్ వెలుపల అతిపెద్ద పరేడ్ వేడుకను న్యూయార్క్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవం రూపంలో జరుపుకున్నాం. వేడుకల్లో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

- August 18, 2025
0
58
Less than a minute
Tags:
You can share this post!
editor